ఈ వారంలో నేను చదివిన రెండు మంచి తెలుగు పుస్తకాలు
కొన్ని కలలు కొన్ని మెలకువలు
చినవీరభధ్రుడు
విజయవాణి
2005
328
పుస్తకలోకంలో విహరించే వారికి ఒక్కోసారి ఓ మంచి పుస్తకం ఎదురవుతుంది. దాన్ని చదివినప్పుడు కలిగే ఆనందం దాన్ని వేరే చదువరులతో పంచుకునేటప్పుడు ఉండే అనుభూతి మాటల్లో చెప్పటం కష్టం. ఇంటెర్నెట్ సొషల్ మీడియా ద్వారా చాలా మందికి చేరటం ఓ రకంగా మేలే. విద్య గురించి చాలా పుస్తకాలున్నాయి. కాని ఈ పుస్తకం చదివేటప్పుడు మాత్రం నాకు ఇప్పుడున్న చదువు గురించి చాలా రకాల ప్రశ్నలకు సమాధానం వెతికే అవకాశం మొదలుపెట్టే ప్రయత్నం చెయాల్సిన అవసరం మొదలయ్యింది. ఇందులో రచయిత తన విద్యారంగంతో గడించిన అనుభవాన్నీ, తన అలోచనా విధానంతో క్రోడీకరించి, ఇంతవరకు మన విద్యా విధానంలో ఉన్న లోపాలు మరియు జరిగిన ప్రయోగాలు ఇతర విషయాలను వివరిచటానికి ప్రయత్నం చేసారు. విద్యారంగంలో ఆసక్తి వున్న వారికి ఈ పుస్తకం ఓ మంచి అనుభవాన్ని ఇస్తుంది.
జగన్నాథ కథచక్రాల్
జగన్నాథ శర్మ
అమరావతి పబ్లికేషన్స్
2013
208
నవ్య వార పత్రిక చదివే వారికి ఈ పుస్తకం గురించి వేరేగా పరిచయం చేయనక్కరలేదు, ఎందుకంటే నవ్య వార పత్రికలో వచ్చిన మొదటి పేజీలోని ఓ వంద కథలను పుస్తకరూపంలో విడుదల చేసారు కాబట్టి. రచయిత వెర్వేరు ఆసక్తిని కలిగించే విషయాలను కథల రూపంలో వివరించారు. చాలా కథలు వాస్తవానికి దగ్గరగా వున్నట్టు నాకు అనిపించింది. ఒక్కో కథ ఓ పేజీని మించదు.

No comments:
Post a Comment