Good movie based on a book I enjoyed (Telugu)
"దేవస్థానం", "గుడి" అనే పుస్తకం అధారంగా తీసినది. ఇందులో అనేక పాత్రలున్నప్పటికీ కథ అంతా మూడు పాత్రల మధ్య నడుస్తుంది. దేవస్థానంలో పనిచేసే ఓ పెద్ద మనిషికి తను చనిపోయిన తర్వాత తన అంత్యక్రియల విషయం గురించి ఆలోచన రావడంతో గుడి కి వచ్చే ఓ వ్యక్తి కి ఆ విషయం గురించి చెపుతాడు. మొదట నిరాకరించినా తరువాత అతను ఒప్పుకుంటాడు, తరువాత ఏం జరిగింది అనేది సినిమా చూస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. పుస్తకం బాగున్నప్పటికి సినిమా చిత్రీకరణ ఇంకా బాగుంది. కళాతపస్వి విశ్వనాథ్, S. P.బాలసుబ్రమణ్యం మరియు ఆమని గారి నటన గురించి వీరేగా చెప్పనక్కరలేదు.పుస్తకంలో కాస్త గంభీరత్వం తగ్గిందనిపించింది, బహుశా ప్రేమ కథను మధ్యలో చేర్చినందువల్ల కావచ్చు.
No comments:
Post a Comment